E.G: రాజమండ్రిలోని మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో జనవరి 9వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.హరీష్ చంద్ర ప్రసాద్ గురువారం తెలిపారు. ఈ మేళాలో పలు కంపెనీల ప్రతినిధులు ఉద్యోగాల భర్తీ కొరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని చెప్పారు. ఐటీఐ, డిప్లొమా, నుండి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి.. 19 – 35 సంవత్సరాల వయస్సు గల అభ్యర్థులు అర్హులన్నారు.