KDP: సిద్ధవటం మండలం భాకరాపేట సమీపంలో ఉన్న APSP 11వ పోలీస్ బెటాలియన్లో మహాత్మ జ్యోతిబా పూలే జయంతి వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. అసిస్టెంట్ కమాండ్ కె.వెంకటప్ప జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జ్యోతిబా ఫూలే అణగారిన వర్గాల అభ్యున్నతికి చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.