E.G: రాజమండ్రిలో జరుగుతున్న పుష్కరాల పనులను ఇవాళ ఉదయం ఏపీ డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆయనకు మంత్రి దుర్గేశ్, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కలెక్టర్ కీర్తి చేకూరి ఘన స్వాగతం పలికారు. అనంతరం పవన్ కళ్యాణ్ గోదావరిలో బోటు ప్రయాణం చేస్తూ పుష్కరాల రేవు, కోటిలింగాల రేవులను పరిశీలించారు.