TPT: తిరుపతి నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన పార్లమెంట్ కార్యాలయం వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి, ఎన్టీఆర్కు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, కార్యకర్తలు హాజరై వేడుకను నిర్వహించారు.