PPM: గుమ్మలక్ష్మీపురం మండలం వంగర గ్రామంలో సోమవారం ‘రైతన్న మీకోసం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం రైతుల కోసం అందిస్తున్న పథకాలను రాయితీలను గూర్చి ఇంటింటికి వెళ్లి వివరించారు. సూపర్ సిక్స్ హామీలలో భాగంగా ‘అన్నదాత సుఖీభవ’ కింద నగదును కూడా రైతుల ఖాతాలలో జమ చేశామని ఆమె పేర్కొన్నారు.