నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు కందుకూరులోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు హాజరై, ఎంపీకి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేసిన సేవలను ప్రశంసిస్తూ, ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.