ATP: ఏపీ రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యురాలు గంజిమల దేవి ఉమ్మడి జిల్లాలో నాలుగు రోజులపాటు పర్యటించనున్నారు. ఈనెల 9, 10 తేదీల్లో శ్రీ సత్యసాయి జిల్లాలో, 11, 12 తేదీల్లో అనంతపురం జిల్లాలో పర్యటన కొనసాగుతుంది. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల మధ్యాహ్న భోజనం, ప్రధానమంత్రి మాతృ వందన యోజన అమలు వంటి అంశాలను ఆమె పరిశీలించనున్నారు.