GNTR: అన్నదాత సుఖీభవ పథకంతో పాటు ప్రభుత్వ సబ్సిడీల కోసం రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్, ఈ-కేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలని గురువారం మండల వ్యవసాయ అధికారి సుధీర్ బాబు సూచించారు. పంటల నమోదు గడువు ముగిసిందని, ప్రస్తుతం ఆ వివరాలను అప్లోడ్ చేస్తున్నామని తెలిపారు. పవర్ ప్రేయర్లు, డ్రోన్ల వంటి యంత్ర పరికరాల కోసం యాప్ ద్వారా బుక్ చేసుకోవాలని ఆయన రైతులకు సూచించారు.