E.G: కడియం- 2 పాఠశాల ఉపాధ్యాయురాలు కె. గంగాభవాని జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమెను శనివారం పాఠశాల విద్యార్థుల సమక్షంలో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు పల్లి బేబీ రత్న కుమారి ప్రసాద్, మందపల్లి రత్నారాజు, టీడీపీ మహిళ నాయకులు విజయ, రత్నకుమారి, సత్యవతి తదితరులు పాల్గొన్నారు.