KDP: పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని శ్రీ చరణి నిరూపించారు. VN పల్లె మండలంలో కుగ్రామమైన ఎర్రమల పల్లె గ్రామ కీర్తిని ఆమె జాతీయస్థాయికి తీసుకువెళ్లింది. పట్టుదలతో శ్రమించి తన అసాధారణమైన ప్రతిభతో భారత క్రికెట్ జట్టులో స్థానాన్ని సంపాదించి, మన దేశం ప్రపంచ కప్ సాధించడంలో ముఖ్యపాత్ర పోషించి, పలువురి ప్రశంసలు అందుకుంది.