GNTR: శాసనమండలిలో శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతుండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. ప్రసంగిస్తున్న క్రమంలో ఆయన తూలి పడబోతుండగా, పక్కనే ఉన్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ వెంటనే స్పందించి కిందపడకుండా పట్టుకున్నారు. సమాచారం అందుకున్న అసెంబ్లీ అధికారులు వెంటనే వైద్యులను పిలిపించి పరీక్షలు చేయించారు. ఈ ఘటనపై పూర్త వివరాలు తెలియాల్సి ఉంది.