NLR: విక్రమ సింహపురి యూనివర్సిటీలో వివిధ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ కోసం అడ్మిషన్ల గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించినట్లు డీవోఏ డైరెక్టర్ డాక్టర్ ఎం. హనుమా రెడ్డి ప్రకటనలో తెలిపారు. నాలుగు సంవత్సరాల డిగ్రీ హానర్స్ విత్ రీసెర్చ్ పాసైన విద్యార్థులు పీజీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీకి అర్హులన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.