కృష్ణా: కోడూరు మండలం హంసలదీవి బీచ్‌కు ఆదివారం విజయవాడ, బాపట్ల, గుంటూరు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు కుటుంబ సమేతంగా విచ్చేసి సముద్ర స్నానాలు చేస్తూ సరదాగా గడిపారు. పర్యాటకుల తాకిడితో బీచ్ కళకళలాడింది. పర్యాటకులు స్నానాలు చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలపై పాలకాయతిప్ప మెరైన్ పోలీసులు సూచనలు చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గస్తీ నిర్వహించారు.