ప్రకాశం: కొండేపి మండల కేంద్రంలో గురువారం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన వ్యక్తిగత సిబ్బంది బుధవారం ఒక ప్రకటన ద్వారా విషయాన్ని చెప్పారు. రేపు మధ్యాహ్నం కొండేపి మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని వైద్య శాఖ అధికారులతో సమీక్షా నిర్వహిస్తారని చెప్పారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని కోరారు.