KRNL: జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా, పట్టణంలో ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ‘విజిబుల్ పోలీసింగ్’ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం రాత్రి నుంచి తెల్లవారు జాము వరకు జిల్లా మూడవ పట్టణ సీఐ శేషయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు.