NDL: బేతంచెర్ల నగర పంచాయతీ సంత మార్కెట్, బండ్లమెట్ట, కబేలా వేలం పాటలు అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు కమిషనర్ హరిప్రసాద్ శనివారం తెలిపారు. సొంత మార్కెట్ వేలం పాటలు ప్రారంభించిన తర్వాత మధ్యలో వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. వేలం పాటల తేదీలను తర్వాత ప్రకటిస్తామన్నారు. సంత మార్కెట్, బండ్లమెట్ట వేలంపాటలకు డిపాజిట్ కట్టించుకుని వాయిదా వేశారు.