MDCL: అల్వాల్ సర్కిల్ పరిధిలోని కొత్తచెరువులో పేరుకుపోయిన గుర్రపు డెక్క తొలగింపు పనులను మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి స్వయంగా పర్యవేక్షించారు. చెరువు ప్రక్షాళన పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి, త్వరితగతిన పూర్తి చేయాలని ఆమె కాంట్రాక్టర్ను ఆదేశించారు. స్థానిక ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనుల్లో వేగం పెంచాలని సూచించారు.