GNTR: పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మంగళగిరి కార్పొరేషన్ వద్ద శనివారం సీపీఎం ధర్నా చేసింది. ఎన్నికల హామీని మంత్రి లోకేష్ విస్మరించారని నేత బాబూరావు విమర్శించారు. బడాబాబులకు భూములిస్తూ పేదలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. నెల రోజుల్లో స్థలాలు ఇవ్వకపోతే మంత్రి ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు. నిరసనగా మేలో లోకేష్‌కు 50 వేల ఉత్తరాలు పంపుతామన్నారు.