ATP: కళ్యాణదుర్గంలో ఈనెల 9వ తేదీన నిర్వహించనున్న రైతు పోరుబాట కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి పిలుపునిచ్చారు. రాయదుర్గం పట్టణంలోని మెట్టు కార్యాలయం వద్ద ఆదివారం సాయంత్రం పొరుబాటకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం అడుగడుగునా రైతన్నలను మోసం చేస్తోందని ఆయన పేర్కొన్నారు.