ATP: శింగనమల నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ సాకే శైలజనాథ్ శనివారం సోషల్ మీడియా, ఐటీ విభాగం ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కార్యకర్తలందరూ తన కుటుంబ సభ్యులతో సమానమని, వారిని కాపాడుకుంటామని భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ జగనన్న కోసం ప్రతి ఒక్కరూ సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. ఏఐ సాంకేతికత వినియోగంపై అవగాహన కల్పించారు.