VSP: జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాసరావు పదవీకాలం ముగియడంతో ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఘన సత్కారం నిర్వహించారు. తక్కువ కాలంలోనే మేయర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారని ప్రశంసించారు. నగరాభివృద్ధికి చేసిన సేవలను కొనియాడుతూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు, ఫెడరేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.