సత్యసాయి: కదిరి శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ తలుపులు సోమవారం ఉదయం 6 గంటలకు తెరిచారు. చంద్రగ్రహణం కారణంగా ఆలయ శుద్ధి, పూజాది కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. అనంతరం ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8.30 వరకు భక్తులకు దర్శనం కల్పిస్తామని ఆలయ అధికారులు, అర్చకులు తెలిపారు.