CTR: తమ దందాలకు అడ్డుపడుతున్నాడనే విలేకరి జగన్మోహన్ను నిందితులు హత్య చేసినట్టు తేలిందని పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్, సీఐ సోమశేఖర్ రెడ్డి తెలిపారు. వీకోట పోలీస్ స్టేషన్లో వారు మాట్లాడుతూ.. హత్య కేసు విచారణలో అనేక కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయని, కొంతమంది వి.కోటలో గ్యాంగ్లను ఏర్పాటు చేసుకుని దందాలు చేస్తున్నట్టు తెలిసిందని వివరించారు.