VZM: కొత్తవలస సమస్యలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు చెరుకూరి నాగరాజు తీసుకువెళ్లారు. తుళ్ళూరులో జరిగిన అమరజీవి పొట్టి శ్రీరాములు మ్యూజియం నిర్మాణానికి శంఖుస్థాపన కార్యక్రమంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనను కలిసి రైల్వే అండర్ గ్రౌండ్ నిర్మించినా కూడా వర్షాకాలంలో తీవ్ర అవస్థలు ఇబ్బందులు పడుతున్నామని వినతి పత్రం ఇచ్చారు.