PLD: నాదెండ్ల పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్‌గా ట్రైనీ ఐపీఎస్ నిరంజన్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. శిక్షణలో భాగంగా క్షేత్రస్థాయి పరిపాలన, పోలీసింగ్ విధానాలపై అనుభవం పొందేందుకు ఆయనకు ఈ బాధ్యతలను అప్పగించినట్లు అధికారులు తెలిపారు. సిబ్బందితో సమావేశమై విధుల నిర్వహణపై పలు సూచనలిచ్చారు. ప్రజలకు సత్వర సేవలు అందేలా పనిచేయాలని ఆయన పేర్కొన్నారు.