VZM: బొబ్బిలి నియోజకవర్గంలోని గిరిజన గ్రామాల్లో రోడ్లు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బేబి నాయన కోరారు. విజయనగరంలో సోమవారం జరిగిన డిఆర్సీ సమావేశంలో మాట్లాడుతూ.. రామభద్రపురం మండలంలోని గిరిజన గ్రామాలకు రోడ్డు వేస్తే అటవీశాఖాధికారులు అడ్డుకున్నారన్నారు. బొబ్బిలి మండలంలో కూడా గిరిజన గ్రామాలకు రోడ్డు వేసేందుకు అటవీ అధికారులు అనుమతి ఇవ్వడం లేదన్నారు.