కృష్ణా: యనమలకుదురు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం సాయంత్రం గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆలయ అభివృద్ధి దాత సంగా నరసింహారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీతరామ కోలాట బృందం ప్రదర్శన ఆకట్టుకుంది. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రదక్షిణ పూర్తి చేశారు. అనంతరం భక్తులకు ఉచిత ప్రసాదం పంపిణీ చేసినట్లు ఈవో తెలిపారు.