SKLM: పాతపట్నం మండలంలోని లాభర గ్రామంలో ఉన్న రామాలయాన్ని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి శాంతి మంగళవారం సందర్శించారు. ఈ మేరకు స్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. కమిటీ సభ్యులు దుశ్శాలువతో సత్కరించారు.