ప్రకాశం: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కార్యాలయం, సీడాప్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 27న కనిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి జె.రవితేజ తెలిపారు. ముత్తూట్ ఫైనాన్స్, సింధూజా మైక్రో క్రెడిట్ లిమిటెడ్, పేటీఎం తదితర కంపెనీలు ఈ మేళాలో పాల్గొంటున్నాయన్నారు.