PPM: జిల్లాలో కొనసాగుతున్న రహదారులు, భవనాల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆర్అండ్బి అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పనుల పురోగతిపై సుదీర్ఘంగా చర్చించారు. జిల్లాలో ప్రస్తుతం 1030km నెటవర్క్ ఉందన్నారు.