ప్రకాశం: పొన్నలూరు మండలంలోని సుంకిరెడ్డిపాలెం ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న పిక్కిలి కొండయ్య పై విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థులతో కఠినంగా వ్యవహరిస్తున్నారని అందిన ఫిర్యాదు మేరకు ఒంగోలు డిప్యూటీ డిఈవో శుక్రవారం విచారణ చేపట్టారు. నివేదికను ఉన్నత అధికారులకు సమర్పిస్తామని తెలిపారు.