సత్యసాయి: రొళ్ల మండల నూతన ఎస్సైగా నరసింహుడు బాధ్యతలు స్వీకరించారు. ఈయన గతంలో కదిరి రూరల్ ఎస్సైగా విధులు నిర్వహించారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్సై గౌతమి పుట్టపర్తి వీఆర్‌కు బదిలీ కావడంతో ప్రభుత్వం ఈ నియామకం చేపట్టింది. శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని బాధ్యతలు స్వీకరించిన అనంతరం నూతన ఎస్సై తెలిపారు.