VZM: రాష్ట్రంలో దాదాపు ఏడాదిన్నర కూటమి పాలనలో సీఎం చంద్రబాబు టీచర్లకు ఏమి మేలు చేశారో చెప్పాలని UTF రాష్ట్ర కోశాధికారి రెడ్డి మోహన్ రావు డిమాండ్ చేశారు. ఆదివారం విజయనగరంలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటికీ 50 శాతం విద్యారంగం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ప్రభుత్వం విధానాలే కారణమన్నారు.