ముంబై విసిరిన 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గుజరాత్ ఒకే ఓవర్లో 2 కీలక వికెట్లు కోల్పోయింది. మిచెల్ శాంట్నర్ వేసిన 8వ ఓవర్ రెండో బంతికి సుందర్(26), ఆ వెంటనే 4వ బంతికి ఫిలిప్స్(6) వెనుదిరిగారు. 8 ఓవర్ల ఆట ముగిసేసరికి గుజరాత్ స్కోర్ 56/5 కాగా.. క్రీజులో రాహుల్ తెవాటియా(1), షారుఖ్ ఖాన్(1) ఉన్నారు. విజయం కోసం గుజరాత్ ఇంకా 144 రన్స్ చేయాల్సి ఉంది.