శ్రీకాకుళం: జిల్లా రూరల్ మండలం ఎస్.ఎస్. వలస గ్రామంలోని ఆర్పీహెచ్ కాలనీలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం శిథిలావస్థకు చేరి నిరుపయోగంగా మారింది. నిర్వహణ లేకపోవడంతో భవనం ప్రమాదకర స్థితిలో ఉందని స్థానికులు తెలిపారు. ఒకప్పుడు పరిసర ప్రాంత ప్రజలకు ఉపయోగపడిన ఈ కేంద్రం ప్రస్తుతం పనిచేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.