VZM: గరివిడి ఎస్సై లోకేశ్వరరావు శనివారం రాత్రి కొండపాలెం పంచాయతీ BC కాలనీలో పల్లెనిద్ర నిర్వహించారు. ఈ సందర్భంగా యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, మంచి మార్గంలో ముందుకు సాగాలని సూచించారు. గ్రామాల్లో అవాంఛనీయ కార్యకలాపాలు జరగకుండా పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసులకు సహకరించాలన్నారు.