NTR: వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామ శివారులో నిత్యం చెత్తతో పాటు ఇతర వ్యర్థాలు వేయడం వల్ల పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్న నేపథ్యంలో పంచాయతీ అధికారులు స్పందించారు. పంచాయతీ కార్యదర్శి షేక్ మీర్జావలి ఆదేశాల మేరకు చెత్త వేయరాదని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి, ప్లాస్టిక్ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ. 2000 జరిమానా విధిస్తామని పేర్కొన్నారు.