పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇవాళ ఎల్విన్‌పేట సీఐ చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పోక్సో చట్టం, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, సైబర్ నేరాలపై విద్యార్థులకు సూచనలు చేశారు. మైనర్లు వాహనాలు నడపడం నేరమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై శివప్రసాద్ పాల్గొన్నారు.