ప్రకాశం: కనిగిరి మోడల్ స్కూల్లో ఆరో తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తుల స్వీకరణ ఈనెల 24వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని ప్రిన్సిపల్ డాక్టర్ ఎద్మావతి తులసి తెలిపారు. మార్చి 31వ తేదీ ఫీజు చెల్లింపుకు చివరి తేదీగా నిర్ణయించారు. ఏప్రిల్ 27న ప్రవేశ పరీక్ష నిర్వహించి అదే రోజు ఫలితాలు విడుదల చేస్తామన్నారు.