E.G: రాజమండ్రి 46వ డివిజన్లో జరిగిన దానవాయిబాబు జాతర మహోత్సవంలో MLA వాసు పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన, నగరం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. స్థానిక భక్తులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ వేడుకలో జాతర ప్రాశస్త్యాన్ని ఎమ్మెల్యే కొనియాడారు.