KRNL: మంత్రాలయం మండలం చిలకలడోన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై గురువారం ఎంపీ బస్తిపాటి నాగరాజు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఉన్న ఆయన అధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఈ ఘటనలో 8 మంది కర్ణాటక వాసులు మృతి చెందడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.