ప్రముఖ ఐటీ సేవల సంస్థ విప్రో షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించింది. రూ.15 వేల కోట్లతో షేర్లను తిరిగి కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. మొత్తం 60 కోట్ల షేర్లలో ఒక్కో షేరును రూ.250 చొప్పున కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. రికార్డు తేదీ నాటికి విప్రో షేర్లు కలిగిన వాటాదారులు ఈ బైబ్యాక్‌లో పాల్గొనేందుకు అనుమతిస్తామని పేర్కొంది.