VKB: నవాబ్‌పేట్‌లో టమాటా ధరలు పాతాళానికి పడిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం కోత కూలీల ఖర్చులు కూడా రాకపోవడంతో, పంటను పొలాల్లోనే వదిలేసి గొర్రెలను మేపుతున్నారు. పెట్టిన పెట్టుబడి దక్కక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, టమాటాకు కనీస మద్దతు ధర కల్పించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.