KNR: గన్నేరువరం (M) నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పనులు శరవేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో, స్థానిక ప్రజాప్రతినిధులు పనులను పరిశీలించారు. గన్నేరువరం గ్రామ సర్పంచ్ రంగనవేణి లచ్చినర్సు, యస్వాడ గ్రామ సర్పంచ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కటకం తిరుపతి కలిసి పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు పనుల నాణ్యత, వేగంపై అధికారులతో చర్చించారు.