NTR: విజయవాడలో జిల్లా కలెక్టరేట్ వద్ద మొక్కజొన్న రైతుల సమస్యలపై ఆందోళన జరిగింది. మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు రైతులతో కలిసి పీజీఆర్ఎస్లో వినతిపత్రం అందించారు. గిట్టుబాటు ధర కల్పించి, నందిగామ డీస్టీలరీలు రైతుల నుంచి పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే పోరాటం చేస్తామని హెచ్చరించారు.