SKLM: రైతులందరికీ ప్రభుత్వం 3 విడతలగా ఎకరా 25 కేజీలు చొప్పున యూరియా అందించడం జరుగుతుందని రైతులు ఆందోళన చెందవద్దని కోసమాల పీఏసీఎస్ అధ్యక్షులు సలాన మోహన్ రావు తెలిపారు. ఆదివారం మెలియాపుట్టి మండలంలో వసుంధర, కోసమాలలో రైతులకు అవగాహన కల్పించారు. తాసిల్దార్ పాపారావు, ఎంపీడీవో పండా, ఏఈఓ ప్రభావతి, వీఏఏ జరిత, రైతులు పాల్గొన్నారు.