NTR: ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతి రూపుదిద్దుకుంటుందని, త్వరలోనే విజయవాడ గ్రేటర్ విజయవాడ కావటం తథ్యం అని ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. కేశినేని ఫౌండేషన్ ఆర్ధిక సహాయంతో విజయవాడ గాయత్రి నగర్‌లోని మరనాత ఆలయ ప్రాంగణంలో గ్రేటర్ విజయవాడ పాస్టర్స్ ఫెలోషిప్‌కు సంఘ ఉపయోగార్ధం అంతిమ యాత్ర వాహనాన్ని ఎంపీ సోమవారం అందజేశారు.