BPT: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ఉగాది వేడుకలు శాస్త్రోక్త పూజలు, వేదపారాయణ మంత్రోచ్ఛరణల నడుమ అత్యంత వైభవంగా జరిగాయి. పంచాగ పఠన వేదిక వద్ద ఉత్సమూర్తులు, వివిధ ఆలయాల ప్రధాన అర్చకులు ఆశీనులయ్యారు. ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ వెంకట మురళి, జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్, ఎమ్మెల్యే నరేంద్ర వర్మ హాజరయ్యారు.