ELR: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, తదితర పోస్టుల భర్తీకి ఏలూరులో నిర్వహించిన స్కానింగ్ పరీక్షలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి రాజబాబు ఆదివారం పరిశీలించారు. ప్రశాంతమైన వాతావరణంలో స్కానింగ్ పరీక్షలు నిర్వహించామన్నారు. 7,078 మంది హాజరు కావాల్సి ఉండగా 6,128 మంది హాజరయ్యారన్నారు. అలాగే ఎటువంటి మాస్ కాపీయింగ్ జరగలేదన్నారు.