ATP: గార్లదిన్నె మండలం కల్లూరులోని గపూర్ చికెన్ సెంటర్‌పై విజిలెన్స్ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన 26 గ్యాస్ సిలిండర్లను విజిలెన్స్ ఎస్సై నరేంద్ర భూపతి యాదవ్ స్వాధీనం చేసుకున్నారు. వీటిని అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో ఈ తనిఖీలు చేపట్టారు.